వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

మేడారం సమ్మక్క సారలమ్మను తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రి సత్యవతికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమను వనదేవతలకు  సమర్పించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సత్యవతి వెంట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌ నాయక్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఇతర అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :