కాళేశ్వరం టీఆర్‌ఎస్‌కు ఏటిఎం అయితే.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ

కాళేశ్వరం టీఆర్‌ఎస్‌కు ఏటిఎం అయితే.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ

టీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం ఏటీఎం అయితే, ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బీజేపీ ఏటీఎంలా? అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ కౌన్సిలర్‌ స్థాయికి కూడా పనికిరారని అన్నారు. పాదయాత్రల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలు పెట్టి మతం, కులం పేరుతో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

పచ్చటి పాలమూరును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుడా మాట్లాడుతున్నారన్నారు. ఎల్‌ఐసీ, పవన్‌ హన్స్‌ సంస్థలకు ఎందుకు తక్కువ ధరకు అమ్మేశారు? అందులో ఎంత అవినీతి జరిగిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ రాజకార్ల పార్టీ కాదని, బీజేపీనే బందిపోట్లు, జేబుదొంగల పార్టీ అని విమర్శించారు.

 

 

Tags :