సీఎం కేసీఆర్ కు వరల్డ్ బెస్ట్ టూరిజం అవార్డు అందజేత

సీఎం కేసీఆర్ కు వరల్డ్ బెస్ట్ టూరిజం అవార్డు అందజేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూదాన్‌ పోచంపల్లి గ్రామానికి వచ్చిన వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం అవార్డు సర్టిఫికెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అందజేశారు. ఇటీవల ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ నిర్వహించిన వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డు కోసం సుమారు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలలో మన రాష్ట్రం నుండి భూదాన్‌ పోచంపల్లి గ్రామం బెస్ట్‌ టూరిజం విలేజ్‌ అవార్డ్‌ను సాధించిన సందర్భంగా యూఎన్‌డబ్ల్యూటీఓ వారు అందించిన సర్టిఫికెట్‌ను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags :