ఖిలాషాపూర్ కోటతో పాటు.. తాటికొండ కోట కూడా

ఖిలాషాపూర్ కోటతో పాటు తాటికొండ కోట కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కోటను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖిలాషాపూర్ కోటకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. కోట గోడ కూలడంతో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు పది రోజులలో స్థలం కేటాయిస్తామని తెలిపారు. పాపన్న జయంతి ఉత్సవాలు కోటలో జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతినెలలో ఒకరోజు ఉపాధి హమీ పథకంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags :