లండన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసన

లండన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసన

లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అక్కడ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన రాకేష్‌ కుటుంబ సభ్యులకు మంత్రి తీవ్ర సంతాపం తెలిపారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హింసా వాదాన్ని ప్రోత్సహింస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, విధానాలతో దేశం పరువు  ప్రతిష్టలు దిగజారుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగంలో నల్లచట్టాలను తీసుకొచ్చి, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేకమంది రైతుల ప్రాణాలను బలిగొన్నదని తెలిపారు.  మహ్మద్‌ ప్రవక్తపై అనాలోచిత విమర్శలు చేసి ప్రపంచం ముందు దేశం పరువు, విలువలను దిగజార్చారని ధ్వజమెత్తారు. మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని లండన్‌లోని గాంధీ విగ్రహానికి మంత్రి తలసాని వినతి పత్రాన్ని అందజేసి వేడుకున్నారు.

 

Tags :