MKOne Telugu Times Youtube Channel

ఎక్కడా జరగని అభివృద్ధి.. విశాఖ జిల్లాలో

ఎక్కడా జరగని అభివృద్ధి.. విశాఖ జిల్లాలో

రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి విడదల రజనీ అన్నారు. విశాఖ  జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ  రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విశాఖ జిల్లా అంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు.  అభివృద్ధికి సంబంధించి సమావేశంలో చర్చలు జరిపినట్లు తెలిపారు. అనంతరం అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎప్పటి నుంచే పెండిరగ్‌లో ఉన్న సింహాచలం భూ సమస్య, హౌసింగ్‌, జీవీఎంసీలో బేసీక్‌ ఎమర్జెన్సీ, రోడ్లు, అండ్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర పనులకు సంబంధించి అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారన్నారు. రాబోయే రోజుల్లో మార్పును  ప్రజలు చూస్తారని, ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

 

Tags :