ఇలాంటివి ఏపీలో తప్ప మరెక్కడా జరగవు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.800 కోట్లు ఉద్యోగుల సొమ్ము ఎవరు వాడుకున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా వారు దోచుకున్న సొమ్ములు కూడా మాయం కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరెక్కడా జరగదని దుయ్యబట్టారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అప్పులు తేవడానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగస్తుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్‌ని జగన్ ప్రావిడెంట్ ఫండ్‌గా మార్చేశారన్నారు.