అక్కడ విజయం సాధిస్తే.. వచ్చే ఎన్నికల్లో

అక్కడ విజయం సాధిస్తే.. వచ్చే ఎన్నికల్లో

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి సెమీ ఫైనల్‌ లాంటిదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడుతూ అక్కడ విజయం సాధిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ మునిగిపోయే పడవ అన్నారు. కాంగ్రెస్‌ గోవు లాంటిది, బీజేపీ పులి లాంటిదని రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. పాలిచ్చే, పూజించే గోవును వదిలి పులి వద్దకు వెళ్తే ఏమవుతుందని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు బీజేపీకి ఓటేయాలా? అన్నింటి ధరలు పెంచినందుకు, తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సెమీ ఫైనల్‌ లాంటిదని అన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపుఖాయమని అన్నారు. పోరాడే అవకాశం ఇచ్చిన రాజగోపాల్‌ రెడ్డి ఉపయోగించుకోలేదన్నారు. మూడున్నరేళ్లలో ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆయన పైట్‌ చేస్తానంటే కాంగ్రెస్‌ అడ్డుపడిరదా? అని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇక అసెంబ్ల్లీలో అడుగు పెట్టరని వ్యాఖ్యానించారు. దేశంలో సైనికులకు వేతనాలు, ఫింఛన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని జీవన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags :