ఆయన ఎందుకు రాజీనామా చేశారో...ఆయనకే తెలియదు

ఆయన ఎందుకు రాజీనామా చేశారో...ఆయనకే తెలియదు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు సీటు తమదేనని అన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా ప్రధాని మోదీ మాట్లాడారని జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. మునుగోడు అంతా పొలిటికల్‌ గేమ్‌ అని, రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆర్‌ఎస్‌ తేల్చుకోవాలని సూచించారు.

 

Tags :