అక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా.. అభివృద్ధి ఆగలేదు

అక్కడ మా ఎమ్మెల్యే  లేకపోయినా.. అభివృద్ధి ఆగలేదు

మునుగోడులో తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా హైదరాబాద్‌లో దోమలగూడలోని భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్‌నే విజయం సాధిస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట అని అన్నారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో హేమాహేమీలను ఓడిరచామని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని నడపడంలో సీఎం కేసీఆర్‌ ముందుంటారని చెప్పారు. బిహార్‌ రాజకీయాలను యావత్‌దేవం గమనిస్తోందని అన్నారు. అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, తెరవెనుక రాజకీయాలు బీజేపీకి మంచిది కాదన్నారు. ఇలాంటి వాటికి మునుగోడు ఉప ఎన్నిక సమాధానం చెబుతుందన్నారు.

 

Tags :