ఆయుధ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

ఆయుధ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

దసరా వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధ పూజ నిర్వహించి, పాలపిట్ల దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రామాలయంలో జరిగిన శమీపూజలో పాల్గొన్నారు. అనంతరం కంటేశ్వర్‌ పాలిటెక్నిక్‌ మైదానంలో జరిగిన బాణాసంచా విన్యాసాలను ఎమ్మెల్సీ కవిత తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ, దేవి నవరాత్రుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషకరమన్నారు. దసరా అంటే అందరికీ ప్రత్యేకమైన పండుగ అని అన్నారు. గత రెండేళ్లు కరోనా కారణంగా దసరా వేడుకలను జరుపుకోలేకపోయామని పేర్కొన్నారు.

 

Tags :