ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత

ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే మహాసభలు, యూత్‌ కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న మహాసభల్లో భాగంగా మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ప్రైమ్‌ మీట్‌కు ఆమె అతిథిగా హాజరవుతారు. అనంతరం బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈసారి మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. మహాసభ ఏర్పాట్ల కోసం 80 కమిటీలు శ్రమిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

 

Tags :