మెజారిటీ ఉంటే అవసరం... లేకపోతే దండగా?

మెజారిటీ ఉంటే  అవసరం...  లేకపోతే దండగా?

శాసనమండలి రద్దు, మూడు రాజధానులు, ఎయిడెడ్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహణ్యం ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెజారిటీ వచ్చినప్పుడు మండలి అవసరం, లేకపోతే దండగా? అని ప్రశ్నించారు. శాసనమండలి అవసరం లేదని ఏటా రూ.60 కోట్ల కు పైగా ఖర్చు దండగ అని చెబుతూ పెద్దల సభను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఇప్పుడు అదే తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో మరో తీర్మానం చేసిందన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేసినంత మాత్రాన వికేంద్రీకరణ జరగదన్నారు. ఎయిడెడ్‌ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు అని మండిపడ్డారు.

 

Tags :