ఈ అభివృద్ధి పథంలో అమెరికా కీలక భాగస్వామి : మోదీ

ఈ అభివృద్ధి పథంలో అమెరికా కీలక భాగస్వామి : మోదీ

అమెరికా రాజధానిలో జరుగుతున్న భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు రెండు దేశాల స్నేహ సంబంధాల్లో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ అమెరికన్లు వాషింగ్టన్‌లో నిర్వహించిన ఆజదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమానికి పంపించిన సందేశంలో ఈ విషయాలను పేర్కొన్నారు. రానున్న 25 ఏళ్ల కాలానికి భారత దేశం ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుందని, ఈ అభివృద్ధి పథంలో అమెరికా కీలకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. భారత్‌ అనే పదం ఏక కాలంలో ఆధునిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, ప్రాచీన నాగరికతలకు, సంస్కృతులకు నిలయం వంటి అనేక అంశాలను ప్రాతినిధ్యం వహిస్తోందని ప్రధాని వివరించారు.

భారతీయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మానవీయ విలువల సౌరభావలను తమ వెంట తీసుకెళ్తారని ప్రశంసించారు. అన్య సంస్కృతులను గౌరవిస్తూ,  అక్కడి వారితో మమేకమవుతూ ఆయా సమాజాలను సుసంపన్నం చేస్తున్నారని తెలిపారు. 75వ భారతీయ అమెరికన్ల సంస్థలు సంయుక్తంగా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

 

Tags :