యుద్ధం ఆపండి.. పుతిన్ కు మోదీ సూచన

యుద్ధం ఆపండి.. పుతిన్ కు మోదీ సూచన

ప్రస్తుతం యుద్ధం జరిపే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతిచర్చలు ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఓ) సదస్సులో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలయినంత త్వరగా ఆపి వేయాలని ఆయన పుతిన్‌ను కోరారు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుపడిన భారత విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు పుతిన్‌కు మోదీ ధన్యవాదాలు ఎలిపారు.

ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇరువురు నేతలు ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై పుతిన్‌ స్పందిస్తూ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని అనుకొంటున్నామని, సంక్షోభానికి వీలయినంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని తెలిపారు. సంక్షోభ వేళ భారత్‌ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి పుతిన్‌ పుట్టిన రోజు శుభాకాక్షలు తెలియజేశారు. సెప్టెంబర్‌ 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు కావడం గమనార్హం.

 

Tags :