సెప్టెంబర్ 24న బైడెన్, మోడీ సమావేశానికి ఏర్పాట్లు

సెప్టెంబర్ 24న బైడెన్, మోడీ సమావేశానికి ఏర్పాట్లు

భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమావేశం కానున్నారు. సెప్టెంబర్‌ 24న జో బైడెన్‌, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్‌ హౌస్‌ ప్రకటించింది.  ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్‌ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. వీరు గతంలో వర్చువల్‌ ద్వారా జరిగిన క్వాడ్‌ సమ్మిట్‌, క్లైమేట్‌ చేంజ్‌ సమ్మిట్‌, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు. 

 

Tags :