2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిపై .. అమిత్ షా క్లారిటీ

2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిపై  .. అమిత్ షా క్లారిటీ

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. బీజేపీ-జేడీయూ పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిఏ పోటీ చేస్తాయని అన్నారు.

 

Tags :