సూప‌ర్ స్టార్ మ‌హేష్ SSMB #28 లో లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ SSMB #28 లో లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ సక్సెస్ తర్వాత మ‌హేష్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌కు వెళ్లారు. త్వ‌ర‌లోనే SSMB 28 సెట్స్ పైకి వెళ్ల‌నుంది. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌న్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఊసే లేదు. అయితే సినిమా కొన్ని రోజుల్లోనే షురూ కానుంద‌ని టాక్‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో వంటి భారీ హిట్ త‌ర్వాత త్రివిక‌మ్ర్ మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. భీమ్లా నాయ‌క్  మూవీకి రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి సూప‌ర్ స్టార్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. అలాగే మ‌హేష్ న‌టించ‌నున్న 28 సినిమా కూడా. ఖ‌లేజా సినిమా కూడా విడుద‌లై ప‌దేళ్లు దాటేసింది. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం స్టార్ న‌టీనటుల‌ను లైన్‌లో పెడుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్‌, పృథ్వీరాజ్ సుకుమార్.. ముగ్గురిలో ఒక‌రు మ‌హేష్‌కి విల‌న్‌గా న‌టిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ న‌టుడు, న‌టి కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నారంటూ టాక్‌. మ‌హేష్ అంకుల్ పాత్ర‌లో మోహ‌న్ బాబు  క‌నిపించ‌బోతున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ ఆయ‌న పాత్ర‌ను డిఫ‌రెంట్ ప్లాన్ చేస్తున్నార‌ని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అలాగే సీనియ‌ర్ న‌టి శోభ‌న  కూడా ఈ సినిమాలో న‌టించ‌నుంద‌నే స‌మాచారం వినిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదే విష‌యం అధికారిక‌మైతే మ‌హేష్‌తో మోహ‌న్ బాబు క‌లిసి న‌టించే తొలి చిత్ర‌మిదే అవుతుంది. మరి ఈ కాంబోలో ఎలా మెప్పిస్తుందో చూడాలి మ‌రి.

 

Tags :