డిజాస్టర్ గా నిలిచిన స్టార్ హీరో సినిమా...

మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం. విలక్షణమైన కథలని ఎంచుకొని తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు మోహన్ లాల్. తెలుగు ఆడియన్స్ కి సైతం ఈ హీరో సుపరిచితుడే. " దృశ్యం, మన్యం పులి, లూసిఫర్ " వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేశాడు ఈ మలయాళం హీరో. అయితే ఇటీవలి కాలంలో మోహన్ లాల్ టైం బాగాలేదని చెప్పుకోవాలి.
ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, సరైన కథా కథనం లేనిది ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరించరని మరోసారి రుజువైంది. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన "అలోన్ (ఒంటరి)" మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి షాజీ కైలాష్ దర్శకత్వం వహించారు. ఒకప్పుడు వరుస హిట్స్ తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన డైరెక్టర్ కైలాష్ చాలా కలం తర్వాత మళ్ళీ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఎన్నో అంచనాలతో, భారీ తారాగణంతో రిలీజైన ఈ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం ప్రేక్షకులని నిరాశ పరిచింది.
ఈ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ప్రమోషన్లు, ట్రైలర్ చూశాక అలోన్ లో పెద్దగా మ్యాటర్ ఉండదని ఇటు ఫ్యాన్స్ కి, అటు ఆడియన్స్ కి ముందుగానే అర్థమైపోయింది. దీంతో మోహన్ లాల్ కెరీర్ లోనే అతి దారుణమైన ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. తన కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు దాటిన మోహన్ లాల్, సినిమా జర్నీ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి నలభై అయిదు లక్షలకు మించి రాలేదని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఎంత స్టార్ హీరో అయినా కథల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.