అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అగ్రరాజ్యం అమెరికాలో మంకీపాక్స్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అక్కడ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సను వేగవంతం చేయనున్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు నమోదు అయ్యాయి.  దీంట్లో మూడవ వంతు కేసులు న్యూయార్క్‌లో బయటపడ్డాయి. ఆ రాష్ట్రం స్వంతంగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 26 వేల కేసులు నమోదు అయినట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. శృంగారం ద్వారా మంకీపాక్‌స సోకుతున్నట్లు తెలుస్తున్నా, దీనిపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమర్జెన్సీ అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Tags :