సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మకమైన నిర్ణయం?

సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మకమైన నిర్ణయం?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. రైతులకు పింఛన్‌ ఇచ్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో సరికొత్త పథకానికి ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధం అవుతున్నట్లు భావిస్తున్నారు. రైతుల పింఛన్‌పై సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రైతులకు రూ.2వేలు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు రైతుబంధును ఇస్తున్న సంగతి తెలిసిందే.

 

Tags :