గోల్డీ బ్రార్ అమెరికాలో అరెస్టు

గోల్డీ బ్రార్ అమెరికాలో అరెస్టు

సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను అమెరికాలో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తెలిపారు. త్వరలోనే గోల్డీ బ్రార్‌ను భారత్‌ రప్పిస్తామని పేర్కొన్నారు. కాలిఫోర్నియా పోలీసులు బ్రార్‌ను  అరెస్టు చేశారు.  వారు భారత్‌ ప్రభుత్వాన్ని పంజాబ్‌ పోలీసులను సంప్రదించారు అని సీఎం తెలిపారు. లారెన్స్‌  బిష్టోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సతీందర్‌జీత్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ 2017 నుంచి కెనడాలో ఉంటున్నాడు.  ఇటీవల అమెరికాకు మకాం మాచ్చినట్లు సమాచారం.

 

Tags :