MKOne TeluguTimes-Youtube-Channel

ఏడాది నుంచి ఉక్రెయిన్ లో సుమారు లక్షకు పైగా .. అమెరికా

ఏడాది నుంచి ఉక్రెయిన్ లో సుమారు లక్షకు పైగా .. అమెరికా

గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా అటాక్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంవత్సర కాలంలో సుమారు లక్ష మందికి పైగా ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికాకు చెందిన పొలిటికో వెబ్‌సైట్‌ పేర్కొన్నది. కీవ్‌ వద్ద తగినంత ఆయుధ సామాగ్రి లేదని, అనుభవం ఉన్న సైనికులు లేరని అమెరికా వెల్లడించింది. ఏడాది నుంచి ఉక్రెయిన్‌లో సుమారు లక్షకు పైగా సైనికులు చనిపోయినట్లు అమెరికా అధికారులు తెలిపినట్లు  పొలిటికో ప్రకటించింది. బక్‌ముత్‌ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. డోనస్కీ ప్రాంతంలో ఉన్న ఆర్టిమోవస్కీలో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, కానీ ఆ ప్రాంతాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుక్నుట్లు తెలిపింది. రష్యా అక్రమణ మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో సుమారు లక్షా 20 వేల మంది చనిపోయి ఉంటారని అమెరికా, యూరోప్‌ అధికారులు తెలిపారు.

 

 

Tags :