కేసిఆర్ ప్రభుత్వం ఉన్నంతవరకు రాష్ట్రంలో పరిశ్రమలు రావు: ఎంపీ అరవింద్

కేసిఆర్ ప్రభుత్వం ఉన్నంతవరకు రాష్ట్రంలో పరిశ్రమలు రావు: ఎంపీ అరవింద్

తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాటల తూటాలు పేల్చారు. "ప్రతిదానికీ అరవింద్ మమ్మల్ని తిడుతూనే ఉంటాడు. ఆయన ఎన్ని మాటలు అన్నా పడతాం" వంటి నంగనాచి మాటలు చాలని, ముందు తన పనిపై దృష్టి పెట్టాలని సూచించారు. పసుపు రైతులకు ఎంత ఇస్తారో కేసీఆర్ ను అడిగి ప్రశాంత్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీఆరెస్ ను ఓడించి, డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకురావాలని ప్రజలకు చెప్పారు.  నిజామాబాద్ లో పసుపు శుద్ధి పరిశ్రమ పెట్టేందుకు వచ్చిన వాళ్ళు.. కమిషన్ల భయంతో పారిపోయారని అరవింద్ ఆరోపించారు. ఎవరైనా జిల్లాలో పరిశ్రమలు పెదటామని వస్తే, ప్రశాంత్ రెడ్డి తదితరులు పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావని అరవింద్ తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎలాంటి  పరిశ్రమలు రావని, కేంద్ర పథకాలు అమలు చేయాలన్నా ఇక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం దొరకడం లేదని పేర్కొన్నారు.

 

 

Tags :