కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... అధికారికంగా

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... అధికారికంగా

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజని అన్నారు. రజాకార్లను తరిమికొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషిచిందని గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రగల్భాలు పలికి రాస్ట్రంలో అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. నిజాం, రజాకార్లను తరిమికొట్టడంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేదని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంతోనే నిజాం తోకముడిచిందని అన్నారు.

 

Tags :