సుప్రీంకోర్టు నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : రఘురామ

సుప్రీంకోర్టు నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : రఘురామ

రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టు నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజద్రోహం కేసుపై స్టే విధించడం ఒక చరిత్రాత్మకమని పేర్కొన్నారు. కొందరిపై రాజద్రోహం కేసు పెట్టి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. లెఫ్టినెంట్‌ సునీల్‌కుమార్‌ చేత సీఎం జగన్‌ తనపై రాజద్రోహం కేసు పెట్టారన్నారు. మీడియా, ఇతరులపై కూడా రాజద్రోహం కేసు పెట్టారన్నారు. రేపు మా ప్రభుత్వం మారడం ఖాయం. నేనే రాజు.. నేనే సీఎం అనుకుంటే కష్టం అన్నారు. నారాయణపై కక్ష సాధింపునకే కేసులు పెట్టారు. కక్ష సాధింపులతోనే ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాజధాని రోడ్లు లేని రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు.

 

Tags :