కోర్టులు, ప్రతిపక్షాలపై నిందలా? : రఘురామ

కోర్టులు, ప్రతిపక్షాలపై నిందలా? : రఘురామ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు. ఒక సెంటు, ఒకటిన్నర సెంటు స్థలంలోనే ఇంటి నిర్మాణం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు భూ సేకరణలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించేవారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఎంఎస్‌వో లైసెన్సును ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ అనధికారికంగా వాడిరదని ఆరోపించారు. దీనిపై తన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి చెప్పారని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వంలో కొంతమంది వక్రభాష్యాలు పలుకుతున్నారన్నారు.

 

Tags :