రఘురామ సంచలన వ్యాఖ్యలు ... విజయసాయితో కలిసి పనిచేస్తా

రఘురామ సంచలన వ్యాఖ్యలు ... విజయసాయితో కలిసి పనిచేస్తా

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిని ఢిల్లీ కి పరిమితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీ లో ఉపయోగించుకునేందుకే ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను విజయసాయితో కలిసి ఢిల్లీ లో పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్‌లో విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని అన్నారు. విద్యుత్‌ సమస్య చాలా తీవ్రమైనది అన్నారు. విద్యుత్‌పై మంత్రి, అధికారులు మాట్లాడాలని కానీ సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు.  జగన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే ఇప్పుడు జనగన్న కరెంట్‌ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందన్నారు. ఈ కొత్త పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందన్నారు.

 

Tags :