ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు..జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో

ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు..జార్ఖండ్‌కు  చెందిన వ్యక్తులతో

జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై అన్ని వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం ఇకపై కొనసాగదన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేను రాసిన లేఖకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరన్నారు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకే వినియోగిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతను దారుణంగా హత్య చేశారు. సీఎం జగన్‌కు రాష్ట్రంలో వ్యవస్థ నచ్చకపోతే వ్యవస్థను, వ్యక్తి నచ్చకపోతే వ్యక్తిని తీసేస్తారు. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ పై నేను ఇచ్చిన ప్రివిలేజ్‌ పిటిషన్‌ పై బండి సంజయ్‌ వ్యవహారంలో స్పందించినంత వేగంగా స్పందించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. చిరంజీవిని అల్లరి చేయించడానికి ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పని అన్నయ్యగా చిరంజీవి చెయ్యరు. చిరంజీవి చెప్పకపోతే ముఖ్యమంత్రికి సినిమా కష్టాలు తెలియవా?  ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్‌ కల్యాణ్‌ కు చిరంజీవి మద్దతు ఇవ్వాలి. ఇకపై సీఎం విందుకు చిరంజీవి వెళ్లాల్సిన అసవరం లేదు. సీఎం అయినంత మాత్రాన 3 రూపాయలకు సినిమా చూపిస్తాను అంటే కుదరుద. సినిమా రంగానికి అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి అని పేర్కొన్నారు.

 

Tags :