ఎవరు ఎవరితో వెళ్లినా.. వైసీపీ ఒంటరిగానే

ఎవరు ఎవరితో వెళ్లినా.. వైసీపీ ఒంటరిగానే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యాచారాలు ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ నేతల పనే అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో జాబ్‌ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని ఆరోపించారు. భయపడేవారే పొత్తుల కోసం ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరితో వెళ్లినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.   గతంలో కన్నా సీట్లు పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని అన్నారు.

 

 

Tags :