రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదు : విజయసాయిరెడ్డి

రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదు : విజయసాయిరెడ్డి

కేంద్రం కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలోనే ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బాగుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంక ఎగుమతుల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు చాలా ఎక్కువని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా సెస్‌, సర్‌ఛార్జీలను పెంచుకుంటోందని విమర్శించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్రప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సీఎం జగన్‌ లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందన్నారు.

 

Tags :