తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనత

తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనత సాధించింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఫోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకుంది. పోర్ట్‌బ్లెయిర్ ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్. సెల్వి, ఛైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచారు. 24 స్థానాలున్న కౌన్సిల్‌లో ఆమెకు 14 ఓట్లు దక్కాయి. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాలకు వెలుపల మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ వంటి కీలక పదవిని టీడీపీ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. దీనిపై మంగళగిరిలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికైన ఎస్.సెల్వికి, అక్కడి పార్టీ నాయకులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
Tags :