ఆ జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం...

ఆ జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం...

వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల జాబితాలో ముఖేశ్‌ అంబానీ చేరారు. బిలియనీర్ల ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌లో 11 మంది ఉన్నారు. ముఖేశ్‌ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముకేశ్‌ ఆస్తుల విలువ సుమారు 100.6  బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌స ఇండెక్స్‌ పేర్కొంది.  బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం ఏడాది 23.8 బిలియన్ల డాలర్లను ముఖేశ్‌ అర్జించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌, బేజోస్‌ తర్వాత బెర్నార్డ్‌ అర్నాల్ట్‌, బిల్‌ గేట్స్‌, ల్యారీ పేజ్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, సెర్గే బ్రిన్‌,  లారీ ఎలిసన్‌, స్టీవ్‌ బాల్మర్‌, వారెన్‌ బఫెట్‌, ముఖేశ్‌ అంబానీలు ఉన్నారు.

 

Tags :