ముకేశ్ అంబానీ భారీ విరాళం

ముకేశ్ అంబానీ భారీ విరాళం

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కేరళలో పర్యటించారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ప్రఖ్యాత గురువాయూర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదానం కోసం రూ.1.5 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన మెడికల్‌ సెంటర్‌ ప్రణాళికను ముకేశ్‌ ముందు ఉంచిన అధికారులు అందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని సాయం చేయాలని కోరారు.

 

Tags :