తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి పర్వదినంతో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ దేవాలయాల్లో వీఐపీ తాకిడితో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకున్నారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కరోనా విజృంభణతో పలు ఆలయాల్లో ఆలయ అధికారులు ఆంక్షలను కూడా విధించారు. కొవిడ్‌ ఉధృతి దృష్టా పలు ఆలయాల్లో  వైకుంఠద్వారా దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి.

తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవార్లకు భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగాయి. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయంలో దర్శనాలు జరిగాయి. వేకువ జాము నుంచే భక్తులు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుందనే భారీగా తరలి వచ్చారు.

 

Tags :