భారత పర్యాటకులకు.. రష్యా ఆహ్వానం

భారత పర్యాటకులకు.. రష్యా ఆహ్వానం

ఇరుదేశాల స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులకు మాస్కో ఆహ్వనం పలుకుతోందని మాస్కో సిటీ టూరిజం కమిటీ డిప్యూటీ చైర్మన్‌ అలీనా అరుత్యునోవా తెలిపారు. పర్యాటక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా భారతీయ సినిమా, చిత్ర నిర్మాణాలను ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చామని, దీనికి మాస్కో ఫిల్మ్‌ కమిషన్‌ సహకరిస్తోందని తెలిపారు. కరోనా అనంతరం మాస్కో పర్యటిస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, 2023 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుకోవచ్చని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దీనికి ప్రస్తుతం చర్చల్లో ఉన్న వీసా రహిత ప్రవేశాలు దోహదం  చేస్తాయని తెలిపారు.

 

Tags :