కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని చెప్పారు. త్వరలో అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని చెప్పారు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. రాజీనామా అంశంతో పాటు సీఎం కేసీఆర్‌ పాలన, కాంగ్రెస్‌ పార్టీ నేతలపై రాజగోపాల్‌ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌నను దుర్భాషలాడిన వ్యక్తి చెబితే తాము వినాలా? ఆయన కింద తాము పనిచేయాలా? అంటూ అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు గౌరవం ఉండొద్దా? అని ప్రశ్నించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా తానెప్పుడే మాట్లాడలేదని అన్నారు. కమిటీల ఏర్పాటులో సీనియర్‌ నేతలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇతర పార్టీల నుంచి వ్యక్తికి పీసీసీ పదవిలో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా రాజీనామా అంశం తీవ్రస్థాయిలో చర్చ జరగడంతో పాటు పక్కదాడిరి పడుతోంది. గిట్టని వ్యక్తులు  సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంకెంత మాత్రం వేచి చూడకుండా రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

 

Tags :