మరోసారి బంపర్ ఆఫర్ కొట్టేసిన థమన్..!

ఇటు రాజకీయాలు, అటు వరుస సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీ గా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సుజిత్ దర్శకత్వంలో రానుందని ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా పై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సోమవారం ఈ న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, హాసిని హారిక చిన్నబాబు కూడా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే సాహో ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, పక్కా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. పవన్ అన్ని సినిమాలంటే భిన్నమైన కథతో ఈ సినిమా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే తెలుపుతాము అన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ ఎవరు అందించబోతున్నారు అనే దాని పై రకరకాల కథనాలు వచ్చాయి. చాలా వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పవన్ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ, ఇప్పుడు ఆ వార్తలకి చెక్ పెడుతూ, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని తెలిసిపోయింది. ఈరోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా హాజరవ్వడం విశేషం. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ని అందించేది అని అంత ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ భీమ్లా నాయక్ సినిమాతో దుమ్ములేపిన థమన్ ఇక ఈసారి కూడా ఒక రేంజ్ మ్యూజిక్ ని ఈ సినిమాకి అందిస్తారని పవన్ ఫాన్స్ అంటున్నారు.