MKOne Telugu Times Business Excellence Awards

సంగీతహోరులో నాట్స్‌ సంబరాలు

సంగీతహోరులో నాట్స్‌ సంబరాలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి.ఈ సంబరాల్లో ప్రముఖ సంగీత దర్శకులతో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కూడా తనదైన బాణీలతో సంగీత ప్రియులను అలరించేందుకు నాట్స్‌ సంబరాలకు తరలివస్తున్నారు. మే 27వ తేదీన మ్యూజికల్‌ ఎక్స్‌ట్రావగంజా పేరుతో ఆయన సంగీత విభావరి జరగనున్నది. 

టాలీవుడ్‌లో అనేక హిట్‌ సినిమాలతో పేరు తెచ్చుకున్న ఎస్‌ఎస్‌ థమన్‌ ఈ సంబరాల్లో సంగీత విభావరి నిర్వహించనున్నారు. మే 28వ తేదీన థమన్‌ థండర్‌ పేరుతో ఆయన సంగీత విభావరి జరగనున్నది.

ఎలిజియం బ్యాండ్‌ పేరుతో సంగీత కచేరిని కూడా నాట్స్‌ సంబరాల్లో ఏర్పాటు చేశారు. మే 26వ  తేదీన ఈ సంగీత విభావరి జరగనున్నది.

 

 

 

Tags :