హైకోర్టు సంచలన తీర్పు... ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే

హైకోర్టు సంచలన తీర్పు... ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే

పంజాబ్‌, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెల్ల డించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం ముస్లిం అమ్మాయి 16 ఏ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్‌ 8వ తేదీన  ఇస్లామిక్‌ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురిచేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.  ఈ క్రమలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 21 ఏళ్ల వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు తన తీర్పులో ఇస్లామిక్‌ చట్టాన్ని ఉదహరిస్తూ షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్టప్రకారమే పెళ్లిచేసుకునే కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరలించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది.

 

Tags :