అమెరికా ప్రభుత్వానికి కూడా ఇదే వర్తిస్తుంది

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకుమెంటరీపై ఈ నెల 7న వాషింగ్టన్‌లో నేషనల్ ప్రెస్ క్లబ్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన ప్యానెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జైలు పాలు చేస్తారని లేదా చంపుతారనే భయం లేకుండా అమెరికా జర్నలిస్టులు స్వేచ్ఛగా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. అమెరికా ప్రభుత్వానికి కూడా ఇదే వరిస్తుంది. మోదీకి అమెరికా అధ్యక్షుడు ఎందుకు స్వాగతం పలకాలి? అని అన్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉన్నదని నిరూపింంచడానికి తన తండ్రి ఒంటరి పోరాటం చేస్తున్నారని, అకారణంగా ఆయనను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆకాశీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయవ్యవస్థ పని చేయడం లేదు. దాన్ని పూర్తిగా కూల్చేశారు. మోదీ పాలనకు ప్రయోజనం కలిగించేలా దాన్ని మార్చేశారు అని ఆరోపించారు.