హెలికాప్టర్‌లో తిరిగితే ఏమిటి ప్రయోజనం? : నాదెండ్ల

హెలికాప్టర్‌లో తిరిగితే ఏమిటి ప్రయోజనం?  : నాదెండ్ల

కడప జిల్లాలోని రాజంపేట మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు తమ బిడ్డగా భావించి గెలిపిస్తే ఈ జిల్లా వాసి అయిన సీఎం జగన్‌ పర్యటించక పోవడం దారుణమన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రయోజనం ఏమిటి. రెండు కోట్లు ఎంత వరకు సరిపోతుంది? అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్‌ అంటారు, ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఇప్పటికి ముంపు  గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో మండలానికి ఒక శాసనసభ్యుడిని పంపారు కదా మరి ముంపు గ్రామాల్లో ఎందుకు ఒక శాసన సభ్యులను పంపలేదని ప్రశ్నించారు.

 

Tags :