సామ్ కనిపిస్తే... అలా చేస్తా...ఫాన్స్ నా పచ్చ బొట్టును కాపీ చేయకండి! : నాగ చైతన్య

సామ్ కనిపిస్తే... అలా చేస్తా...ఫాన్స్ నా పచ్చ బొట్టును కాపీ చేయకండి! : నాగ చైతన్య

లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్న చైతూకు ఎక్కువగా.. సమంత గురించి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్  లేటెస్ట్ మూవీ లాల్‌ సింగ్‌ చడ్డా  ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు అక్కినేని హీరో. ఈ సినిమా రేపు (ఆగస్టు 11) ఆడియన్స్ ముందుకు రానుండగా.. చైతూ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నాడు. అయితే ఆయనకు ఈ మూవీకి గురించి కాకుండా. ఎక్కువగా సమంత  గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన చైతన్యకు.. చేతిపై ఉన్న టాటూ గురించి విలేకర్లు ప్రశ్నించారు. ఆ టాటూకు అర్థం ఏమిటి అని ప్రశ్నించగా.. తన చేతి మణికట్టు దగ్గర మాత్రమే తనకు టాటూ ఉందని.. అదంటే తనకు ఎంతో ఇష్టమని సమాధానం చెప్పాడు చైతూ. అది సమంతతో పెళ్లి జరిగిన డేట్‌ను టాటూగా వేయించుకున్నట్లు తెలిపాడు. అయితే చాలా మంది ఫ్యాన్స్‌కు అది డేట్ అనే విషయం తెలియదని.. ఆ పచ్చబొట్టును కాపీ కొట్టి వాళ్ల చేతులపై వేయించుకున్నారని అన్నాడు.

ఫ్యాన్స్‌కు తాను చెప్పేది ఒక్కటేనని.. పచ్చబొట్టు విషయంలో తనను ఫాలో అవ్వకండని సూచించాడు. అది తన పెళ్లి రోజు అని చెప్పాడు. మరి సమంతతో విడిపోయిన తరువాత ఆ టాటూను మార్చుకోవాలని అనిపించలేదా? అని అడగ్గా.. దాని గురించి తాను ఆలోచించలేదని నాగ చైతన్య సమాధానం ఇచ్చాడు. ఈ పచ్చబొట్టు వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఇప్పుడు మీరు అనుకోకుండా స‌మంతను క‌లుసుకుంటే ఏం చేస్తారు..? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. సామ్‌కు హాయ్ చెప్పడ‌మే కాకుండా.. హ‌గ్ కూడా ఇస్తానని చెప్పాడు చైతూ. 2017 అక్టోబర్‌ 6న పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్న చైతూ-సామ్.. నాలుగేళ్ల కాపురం తరువాత గతేడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి సినిమాలో వారు బిజీగా ఉంటున్నారు. లాల్‌ సింగ్‌ చడ్డా మూవీలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించాడు. కరీనా కపూర్ హీరోయిన్‌‌గా యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి  తెలుగులో సమర్పిస్తుండడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఈ మూవీని ఆమిర్ ఖాన్ భారీ ఎత్తున నిర్మించాడు.

 

Tags :