జులై లో ‘థాంక్యూ’ చెప్పబోతున్న అక్కినేని నాగ చైత‌న్య

జులై లో ‘థాంక్యూ’ చెప్పబోతున్న అక్కినేని నాగ చైత‌న్య

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థాంక్యూ’. నిర్మాత దిల్‌రాజు నుంచి మ‌రో అప్ డేట్ రాలేదు. అక్కినేని ఫ్యాన్స్ థాంక్యూ మూవీ అప్‌డేట్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు థాంక్యూ సినిమాను జూలై 7న రిలీజ్ చేయాల‌ని దిల్‌రాజు భావిస్తున్నార‌ని టాక్‌. అప్ప‌టికే పెద్ద సినిమాల‌న్నీ అయిపోతాయి కాబ‌ట్టి పూర్తిగా థాంక్యూ మీద ఫోక‌స్ చేయ‌వ‌చ్చున‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ట‌.  ల‌వ్ స్టోరి వంటి ప్రేమ క‌థా చిత్రం, బంగార్రాజు వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో వ‌రుస హిట్స్ కొట్టిన అక్కినేని హీరో నాగ చైత‌న్య ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థాంక్యూ’. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధింది కొన్ని పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేశారే త‌ప్ప‌.. ఆ లోపు ప్ర‌మోష‌న్స్‌కు కావాల్సినంత స‌మ‌యం ఉంటుందనేది ఆయ‌న ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌ను అందిస్తున్నారు.

యుక్త వ‌య‌సులోని కుర్రాడు, యువ‌కుడు, మ‌ధ్య వ‌య‌స్కుడు.. ఇలా నాగ చైత‌న్య ఇందులో మూడు డిఫ‌రెంట్ రోల్స్‌లో క‌నిపించ‌నున్నారు. రాశీ ఖ‌న్నా మెయిన్ లీడ్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ కూడా న‌టించారు. మ‌రి ఈ సినిమా చైత‌న్య హ్యాట్రిక్ హిట్ కొడుతారా? అని ఆయ‌న ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య చేస్తోన్న చిత్ర‌మిది. ఇప్పుడు ఇదే ద‌ర్శ‌కుడితో క‌లిసి దూత అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు చైత‌న్య‌. థాంక్యూ సినిమా విడుద‌లైన దాదాపు నెల రోజులు త‌ర్వాత అంటే ఆగ‌స్ట్ 11న చైత‌న్య డెబ్యూ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌ద్దా విడుద‌ల‌వుతుంది. ఇందులో ఆమిర్ ఖాన్ హీరో కాగా.. చైత‌న్య కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

 

Tags :