నాగబాబు కీలక వ్యాఖ్యలు .. వైసీపీ కూడా ఓ పార్టీయేనా

వైసీపీ పార్టీపై జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని విమర్శించారు. నాగబాబు కర్నూల్లో పర్యటించారు. జనసైనికులు, వీర మహిళల నుంచి సమస్యలను తెలసుకోవడానికే తాను కర్నూలుకు వచ్చానని తెలిపారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వమించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనే జనసేనా పొత్తు పెట్టుకుంటుందని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు స్పందించారు. పొత్తు ఎవరితో అనేది మా పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తాడన్నారు. పొత్తులు కుదిరిన తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని తెలిపారు. పొత్తులు కుదరక ముందే పోటీ చేయబోయే స్థానాలపై మాట్లాడటం అనవసరమని అన్నారు.