తానా పాఠశాల చైర్మన్ పదవికి నాగరాజు నలజుల రాజీనామా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాలకు చైర్మన్‌గా ఉన్న నాగరాజు నలజుల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన హయాంలో పాఠశాలను విజయవంతంగా నిర్వహించడంలో తోడ్పడిన టీచర్లకు, చిన్నారుల తల్లితండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయన రాజీనామా చేసినట్లు తెలిసిన వెంటనే పలువురు టీచర్లు, విద్యార్థుల తల్లితండ్రులు స్పందించి తమతో ఓ బ్రదర్‌లాగా ఆయన వ్యవహరించారని, పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆయన చేసిన కష్టం మరువలేనిదని చెప్పారు. కాగా కొన్ని దురదృష్టకర సంఘటన ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నాగరాజు ప్రకటించారు. తానా ఎన్నికల సమయంలో నాగరాజు రాజీనామా ప్రకటన అందరిలోనూ చర్చనీయాంశమైంది.
Tags :