పుకార్లను వార్తలుగా చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నా: అక్కినేని నాగార్జున

పుకార్లను వార్తలుగా చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నా: అక్కినేని నాగార్జున

ఈ  రోజు ఉదయం (27 జనవరి) నుంచి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత- నాగ చైతన్య విడాకుల విషయమై నాగార్జున స్పందించారనే న్యూస్ చెక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై నాగ్ రియాక్ట్ అయ్యారు. మరోసారి మీడియాలో సమంత- నాగ చైతన్య విడాకుల ఇష్యూ ట్రెండ్ అవుతోంది. నిజానికి చై-సామ్ విడాకుల ప్రకటన వచ్చి నాలుగు నెలలు గడిచినా నేటికీ ఈ ఇష్యూపై ఎక్కడో చోట ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నేటి ఉదయం నుంచి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత- నాగ చైతన్య విడాకుల విషయమై నాగార్జున స్పందించారని, మొదట విడాకులు కోరింది సమంతే అని చెప్పారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ ఇష్యూపై నాగ్ స్వయంగా రియాక్ట్ అయ్యారు.

నాగ చైతన్య- సమంత విడాకుల విషయమై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని పేర్కొంటూ కొద్దిసేపటి క్రితం ట్వీట్ పెట్టారు నాగార్జున. ''చై- సామ్ విడాకుల గురించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాన్సెన్స్.. ఆ ప్రచారాలన్నీ అబద్దం. దయచేసి ఇలాంటి అబద్దపు వార్తలు ప్రసారం చేయకండి. పుకార్లను వార్తలుగా చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నా'' అని పేర్కొన్నారు. రీసెంట్‌గా 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున సూపర్ సక్సెస్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఫ్యామీలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది.

 

Tags :