కొత్త డైరెక్టర్ తో ఇబ్బందులు పడుతున్న నాగ్

ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కింగ్ నాగార్జున. ఎప్పుడూ కొత్త దర్శకులకీ, కొత్త కథలకు ప్రాధాన్యత ఇచ్చే నాగ త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడను డైరెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ మలయాళం రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. జనవరిలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రావాల్సింది కానీ రాలేదు.
తర్వాత ఈ సినిమాకు రీమేక్స్ రైట్స్ సమస్య వచ్చింది.మూడేళ్ల క్రితమే ప్రసన్న, అభిషేక్ అగర్వాల్‌తో మలయాళం మూవీ పెరింజు మరియమ్‌జోస్ రీమేక్ రైట్స్ కొనిపించాడు. ఇప్పుడు ఆ రైట్స్‌తో నాగ్ హీరోగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ఆ రీమేక్ కు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో అసలు రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ ఆ సినిమాను తను రీమేక్ చేయబోతున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
గత 20 రోజులుగా ఈ రైట్స్ గురించి అందరి మధ్యలో బాగానే డిస్కషన్ జరుగుతుంది. 20 రోజులైనప్పటికీ ఇంకా రైట్స్ విషయంలో గొడవ ఓ కొలిక్కి రాలేదని టాక్. దీంతో నాగ్ కు కొత్త డైరెక్టర్‌తో బాగా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రసన్న ఈ రీమేక్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు, తన స్టైల్‌లో ఛేంజెస్ చేయబోతున్నాడు.
అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి రెక్కీకూడా చేసుకొచ్చాడు. ఈ మూవీలో కీలక పాత్రల కోసం అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌ని ఇప్పటికే లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ లేదా మే లో షూట్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అప్పటికైనా బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్నీ ఈ రైట్స్ వివాదం ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.