నైనా జైస్వాల్ మరో ఘనత... తల్లీతానూ ఒకేసారి!

నైనా జైస్వాల్  మరో ఘనత... తల్లీతానూ ఒకేసారి!

హైదరాబాద్‌ కాచిగూడ సమీప కుత్భిగూడకు చెందిన అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ (21) మరో ఘనత సాధించారు. తల్లితో కలిసి ఆమె ప్రథమ శ్రేణిలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధి బాగ్‌లింగంపల్లి బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ కళాశాల నుంచి నైనా జైస్వాల్‌, ఆమె మాతృమూర్తి భాగ్యలక్ష్మి ప్రకటించిన లా చివరి సంవత్సర ఫలితాల్లో ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ పూర్తిచేసిన తన తల్లి ప్రోత్సాహంతో న్యాయవిద్య అభ్యసించినట్లు నైనా జైస్వాల్‌ తెలిపారు.

 

Tags :