అమెరికాలో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి

అమెరికాలో నల్లగొండ జిల్లా విద్యార్థి మృతి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్‌ రెడ్డి(25) 2021 లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఎస్‌క్యూరీలో మాస్టర్‌ డిగ్రీలో చేరాడు. 2022 ఆగస్టులో చదువు పూర్తి కానుంది. చదువుకుంటూనే ఏప్రిల్‌లో చూసమ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాడు. క్రాంతి కిరణ్‌ రెడ్డి ఈ నెల 7న సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీంతో క్రాంతి కిరణ్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాదు. ఈ విషయాన్ని  అక్కడే ఉంటున్న అతని ఉన్న చంద్రకాంత్‌ రెడ్డి  కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఈ నెల 13న క్రాంతి కిరణ్‌ రెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

 

Tags :